మా వెబ్ సైట్ కు స్వాగతం!
వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును (యెషయా 55:10-11). ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేవుని వాక్యం అంతా, వచనం తర్వాత వచనం, అధ్యాయం తర్వాత అధ్యాయం, పుస్తకం తర్వాత పుస్తకం, ప్రతి పదం, ప్రతి మాట వ్యాఖ్యాన సహిత ప్రసంగాల (ఎక్సపోసిటోరీ ప్రీచింగ్) ద్వారా తెలుగులోకి అందరికి అందుబాటులో తీసుకొని రావడం. దీని ద్వారా మంచి కుటుంబాలు, ఆరోగ్యకరమైన సంఘాలు కట్టబడాలని ప్రార్దిస్తున్నాము. అలాగే ప్రతి విశ్వాసి మన మహోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకొని, నిత్యమూ ఆయనను ఆరాధిస్తూ, క్రీస్తు స్వరూపంలోకి మారుతూ, పరిశుద్ధాత్మ శక్తితో సత్య సువార్తను దేవుడు తెలియని వారికి ప్రకటించాలని ప్రార్ధిస్తున్నాము. అలాగే, వారిని క్రీస్తుకు శిష్యులుగా చేస్తూ అనేక క్రొత్త స్థానిక సంఘాలను స్థాపించాలని ప్రార్ధన. ఈ పరిచర్య యొక్క అంతిమ ఉద్దేశ్యం దేవుడు మహిమపరచబడాలి, మనుష్యులు దీవించబడాలి. ప్రభువు మంచివాడు!